ఆంధ్రప్రదేశ్ లోని పిల్లలు

పిల్లల కోసంఉన్న సామాజిక అభివృద్ధి సూచికలని ప్రభావితం చేయడంకోసంగాను, రాష్ట్రంలో సృష్టించబడిన సామాజిక సంపదని యొక్క సంపూర్ణమైన స్థాయిలో వినియోగించలేకపోవడం జరుగుతున్నది.

Children doing fun activity at Anganwadi Center-Ist, Cheriyal Village, Mandal - Kandi, District Sangareddy, Telangana.
UNICEF/UN0120477

The challenge

భారతదేశపు ఆగ్నేయ దిశగా గల ఆంధ్రప్రదేశ్ ఏడవ పెద్ద రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కి నైరుతి వైపునగల భాగమే 2014 సంవత్సరం జూన్2 వ తేదీన తెలంగాణా రాష్ట్రం గా అవతరిం చింది. హైదరాబాదు నగరం ఒక పది సంవత్సరాలకాలంపాటు ఈ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా లకు రెండింటికీ ఉమ్మడిరాజధానిగా ఉండేలాగ నిర్ణయించ బడింది. ఆంధ్ర ప్రదేశ్ కి 974 కి.మీ. కోస్తాతీరం ఉన్నది. ఈఆంధ్ర ప్రదేశ్ కి, భారత దేశంలో గుజరాత్ తరువాత, రెండవ అతి పొడవైన సముద్రతీరం ఉన్నది.

ఈరాష్ట్రానికి గల అతి ప్రధాన సూచికలలో కొన్ని:  2015 నమూనా రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకా రం, దేశంలో అప్పుడేపుట్టిన శిశివుల మరణాల రేటు ప్రతి 1000 కి 24 ఉండగా ఇక్కడ అయిదు సంవత్సరాలలోపు పిల్లల మరణాల రేటు ప్రతి 1000 కి 39 వద్ద నిలిచింది. ప్రసవ సమయపు మరణాలరేటు 100,000 సజీవ పుట్టుకలకి 92 నిష్పత్తిలో కాన వస్తుంది (ఆధారమూలం:ఎస్ ఆర్ ఎస్ 2011-2013) జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ సర్వే(ఎన్ ఎఫ్ హెచ్ ఎస్), 4, ఆధారిత వార్త మంటే, 17.2 శాతం అయిదేళ్ళ లోపు పిల్లల బాల్యం వృధాగాగడుస్తున్నది, ఇంకా పిల్లలలో 4.5 శాతం తీవ్రమైన రీతిలో వృధాగా గడు స్తున్నది. గ్రామీణ పారి శుద్ధ్యత నిర్వహణ 57 శాతంవద్ద నిలబడింది. (మూలాధారం: స్వచ్ఛ భారత్ మిషన్ ఎం ఐ ఎస్). ఎన్ ఎఫ్ హెచ్ ఎస్, 4 సర్వేల ప్రకారం, 20-24 ఏళ్ళ మధ్య గల యువతులలో 32.7శాతం అసలు చట్టపరంగా 18సంవత్సరాలుకూడా నిండకుండానే వివా హితులవుతున్నారు., ఇది జాతీయసగటుసంఖ్య కంటే ఎక్కువ. ఇతర వర్గాలకంటే షెడ్యూ ల్డ్ తెగలలోనే అంటే గిరిజనులలోనే చాలా ఎక్కువ కానవస్తుంది. అది కూడా 15-19 ఏళ్ళ వయసుగల యుక్తవయసు బాలికలకే ఈవివాహాలు జరిగిపో తున్నాయి.

గత దశాబ్దంలో విద్యారంగంలో చెపుకోదగ్గ ఆవిష్కరణలు జరిగాయి, విజయాలు సాధించ డం జరిగింది. సుమారు అందరికీ వర్తించేలా ప్రాథమిక నమోదు అప్పర్ పైమరీ స్కూళ్ళలో పెరిగింది, విద్యా ప్రమాణాలు కూడా పెరిగాయి. అదే సమయం లో, 5వతరగతి ఇంకా 8వ తరగతులలో విద్యార్జన స్థాయిలు తక్కువగానే ఉన్నా యి. ఆంధ్రప్రదేశ్ లో విభజన తరువా త, సరియైన అర్హత గల వ్యక్తుల కొరతఉన్నా కూడా, మరిముఖ్యంగా బాలికలకోసంమోడెల్ స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగిం ది. 2016 వార్షిక విద్యా నివేదిక వెలుగుచూసినవిషయ మేమంటే, చిన్న తరగతు లలో పబ్లిక్ ఫండ్ జరిగిన స్కోళ్ళలో పది సంవత్సరాల తరువాత చదడం, ఇంకా అంక గణితాల  స్కోర్లు మెరుగయాయి. 

 ప్రైవేటు స్కూల్లో మరియు ప్రభుత్వ బడిలో చదవడం మధ్య తేడా ఏమంటే, విద్యార్థుల చదువుకి నేర్చుకున్న విద్య స్థాయి తక్కువగా ఉంటున్నది.

రాష్ట్ర ప్రభుత్వం, పల్లెలు, పట్టణాలలో స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం ద్వారా పనిచేస్తున్నది. అందుకోసమై, మహిళలు ఆర్థిక రంగంలో ఎదగడానికి ఒక వేదికను రూపొందించింది. నీతి ఆయోగ్ అడుగుజాడలలో రాష్ట్ర పరివర్తన సంస్థని నోటిఫై చేయడం ద్వారా పాలుపంచుకునేలా చేస్తున్నది. ఎన్నెన్నో సామాజిక ఆర్థిక విధానాలను అమలు చేయడానికి విజన్ స్వర్ణధారా 2029 పథకం రూపకల్పన ద్వారా సానుకూలతను సాధించడానికి కృషి చేస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికే 'స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్' అనే కార్యక్రమాన్ని ఇంకా రాష్ట్ర పోషకాహార వ్యవస్థ అయిన స్టేట్ న్యుట్రిషన్ మిషన్ ల పని మొదలు పెట్టెయ్యడం జరిగింది.

బాలల హక్కులు మరియు సంక్షేమము దిశగా ముందడుగు

నాణ్యతగల విద్యా ప్రమాణాల సేవలు బాలబాలికలకు సమానంగా అందుబాటులోకి వచ్చేలాగ ఒక విద్యార్జన వాతావరణాన్ని సమకూర్చడం పని.

రాష్ట్రంలో యునిసెఫ్(UNICEF) ఒక ముందడుగు వేయించే నాయకత్వపు భాగస్వామి.ఈ సంస్థ రాష్ట్రప్రభుత్వం చేట్టిన ఆరోగ్య, కార్యక్రమాలు, పునరుత్పత్తి, ప్రసూతి, నవజాత శిశువు, పసిబిడ్డలు, యుక్తవయసు పిల్లల ఆరోగ్యం (ఆర్ ఎం ఎన్ సిహెచ్+ఏ/RMNCH+A) స్ట్రాటజీ లేదా విధానం  నాలుగు జిల్లాలలో ఆరంభించిన దానిని అమలు చేస్తుంది. అంతేకాకుండా, ఈ యునిసెఫ్(UNICEF)  రాష్ట్రానికి స్టంటింగ్ తగ్గించడానికి, శిశువులలోను, చిన్నపిల్లలలోను పోషకాహార లోపాలు  తగ్గించడంలోను, ఇంకా చిన్నా రుల ఆహారపు అలవాట్లు మరియు ట్రీట్ మెంట్ మరియు అత్యంత తీవ్రమైన ఆహార లోపాల నిర్వహణము అనే వాటిలో సాంకేతిక సహకారాన్ని అందించి, పాలుపంచుకోవడం జరుగుతున్నది. యునిసెఫ్(UNICEF)  చేపట్టిన మరొక ముఖ్యమైన అంశం, పరిశుభ్రత గురించిన అవగాహన ప్రజలలో పెంచడం, బహిరంగ మలవిసర్జన నిర్మూలన, అలాగే పరిశుభ్రమైన, సుర క్షితమైన మంచినీటి సరఫరా జరిగేలాగ చూడడం అనేఅంశాలపైన దృష్టి పెట్టడం జరిగింది. ఆరోగ్యసేవలకు చెందిన కార్యక్రమాలని ఎవిడెన్స్ ఆధారిత మైన ప్రణాళిక, బడ్జెటింగ్,నిర్వహ ణ అంటే, మానిటరింగ్ లకోసంగాను డాటా వాడుకకి, ఆయా వివరాల నమోదుకి ఆయా సేవలను అందుబాటులోకి తేవడానికి రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బలో పేతం చేయడానికి తనవంతుగా ఈయునిసెఫ్ (UNICEF) ప్రోత్సహిస్తున్నది. యునిసెఫ్  ప్రత్యే కించి మార్జినలైజ్ వర్గాలకి అంటే నిమ్నవర్గాలకి రాష్ట్రప్రభుత్వం అందించే సేవలలో నాణ్యతా ప్రమాణాలు మరింత మెరుగుపరచడానికి కృషిచేస్తుంది. యునిసెఫ్ (UNICEF) చేసే పను లలో ప్రధాన అంశం ఏమంటే, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలపట్ల సామాజిక మరియు ప్రవర్తనలలో మార్పులు, కమ్యూనికేషన్ అప్రోచ్ లని చొప్పించడమే.

రోగనిరోధకత ను పెంచగలిగే దిశగా రాష్ట్రం చేపట్టిన ఇమ్యునైజేషన్ ప్రొగ్రాం కి తన వంతు సహకారాన్ని అందించడానికై దృష్టి పెట్టినది. దీనివలన తట్టు,పొంగుల మీజిల్స్, నిర్మూలనకి, రుబెల్లా వ్యాధిని నియంత్రించడానికి క్రొత్త వ్యాక్సిన్ లని అందుబాటులోనికి తేవడానికి ఇంకా నగర మురికివాడల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో గల తక్కువ రోగనిరోధకత కనిపించే ప్రదేశాలని పరిగణనలోకి తీసుకో వడం జరుగుతున్నది. యునిసెఫ్ ప్రధానంగా చేపట్టే వాటిలో మరొక అంశం వ్యాక్సిన్ ల నాణ్యతని నిలుపడానికి ఉంచే కోల్డ్ చైన్ మరియు ఈ చైన్ సిస్టంల సరఫరాలని మెరుగుపరచడం.

అందుబాటు-ఆధారిత మరియు సమాజ-ఆధారిత దృక్పథాలద్వారా తీవ్రమయిన పోషక ఆహార లోపాలుగల పిల్లలయొక్క జాగ్రత్తలు, వారికి నాణ్యతాప్రమాణాలతో వైద్యం అందించడంలో మెరుగుపరుచుకోవడంలో యునిసెఫ్ ఆరోగ్యం ప్రాధాన్యతనివ్వడం జరుగుతున్నది. ఈ యునిసెఫ్, మైక్రో న్యూట్రియెంట్ సప్లిమెంటేషన్ లని యుక్తవయసుగల బాలికలకు, మహిళలకు  అందించేటప్పుడు, మెరుగైన నాణ్యత కార్యక్రమం అందుబాటులోకి వచ్చేలాగ చూడడం అనే పని అమలుజరగడాన్ని బలోపేతం చేయడానికే ప్రాధాన్యతనిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మంచి నిర్మాణాత్మకమైన ప్రభుత్వం ఉండడం, ఇంకా పోషకాహార రంగంలో అనేక ఆవిష్కరణలను వెలుగులోకి తేవడం కోసమై శక్తివంతమైన స్థాయిలో ఉన్నది. ప్రస్తుతం అమలవుతున్న న్యుట్రిషన్ మిషన్ ద్వారా యునిసెఫ్ బహుళరంగాల భాగస్వామ్యాలని బలోపేతం చేయడానికి పనిచేస్తున్నది. ఇంకా గ్రామపంచాయితీ స్థాయిలోను, ప్రత్యేకించి గిరిజన వాడలలో కానవచ్చే తీవ్రమయిన పోషక ఆహార లోపాలని తగ్గించడానికి గల సామాజిక ఉద్యమం ఆరంభించడానికి యునిసెఫ్ పనిచేస్తున్నది.

రాష్ట్రం యొక్క మరియు జిల్లా అధికారుల యొక్క పనిప్రమాణాలని పెంచడానికి యునిసెఫ్ పనిచేస్తున్నది. ఇందువలన సేవలను తగిన సమయానికి సేవలని అందించడంతో సహా శానిటేషన్  ప్రొగ్రాం ని మరింత శక్తివంతంగా అమలుపరచడం వీలవుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతోపాటు సివిల్ సొసైటీ సంస్థలతో సమిష్టిగా పనిచేస్తూ, యునిసెఫ్ గొప్ప ప్రణాళికను చేపట్టింది. అదేమంటే, జిల్లాలలో పెద్దయెత్తున స్వచ్ఛగ్రాహీలను (శానిటేషన్ వలంటీర్లు)మండలాలు, గ్రామపంచాయితీలలో పర్యావరణహితకరంగా బహిరంగ మలవిసర్జన లేని ప్రాంతాలని రూపొందించడానికి చేసే ప్రచారం చెయ్యడానికి వీలవుతుంది.

విద్యావిషయిక కార్యక్రమాలని అమలుపరచడం, పర్యవేక్షించడం లో యునిసెఫ్ ప్రభుత్వంలోని వివిధ పాలక విభాగాల మధ్యన శక్తివంతమయిన సహకార సమన్వయాన్ని పెంపొందించి తనవంతు సహకారాన్ని అందిస్తున్నది.  ప్రచారంలో కీలకమయిన అంశమే మంటే, ఆదర్శ ప్రత్యామ్నాయ ఎలిమెంటరీ విద్యా విధానాలని ప్రోత్సహించడం, అవికూడా మార్పులకి సౌకర్యవంతంగా ఉండి బడిబయట గల పిల్లలు, యుక్తవయసు బాలలు, ప్రత్యే కించి నిమ్నవర్గాలకు చెందిన వారికి అందుబాటులోకి వచ్చేలా చూసుకోవడం.

యునిసెఫ్ ఒక పటిష్టమయిన ప్రణాళికా బద్ధమయిన విధానాన్ని అదికూడా పిల్లలకి మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో బాలలకి ఇంపుగా ఉండే చైల్డ్- ఫ్రెండ్లీ బోధనా విధానాలని అమలుచేయడానికి అవసరమయినవాటిని రూపొందించడానికి పనిచేస్తూనే ఉంటుంది. ప్రాధాన్యత మాత్రం సామాజిక భద్రత పథకాలకు, అదికూడా, తల్లిదండ్రులని వారి పిల్లలను బడికి పంపేలా ప్రభావితం చేసేలాగ ఉన్నకార్యక్రమాలకు బలం చేకూర్చేదిగా ఉంటుంది.

విద్యాపరమయిన పనులలో యునిసెఫ్ యొక్క  ప్రధాన దృష్టి బాలలు ప్రమాదకరమయిన చోట్లలో కార్మికులుగా పనిచేయడం, బాల్యవివాహాలు, అమ్మకం వంటి వి ఇంకా ఏఇతరమయిన దోపిడీలకిగాని వ్యతిరేకంగా చిన్నపిల్లలని కాపాడడం పై ఉంటుంది.

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలోగల కంగారూ మదర్ కేర్ (కె ఎం సి) వార్డులో ఒక తల్లి తన కవల బిడ్డలయిన ఆడ మరియు మగ శిశువులతో ఉన్నది.
UNICEF/UN0135392/Selaam

యునిసెఫ్(UNICEF) సంస్థ రాష్ట్రంలో ఒక సుశిక్షితమయిన బాలల రక్షణా దళాన్ని  రూపొందించడానికి రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తుంది. అందులో భాగంగానే సిబ్బందిని నియమించుకోవడం నిర్వహించడం జరుగుతుంది. బాలల రక్షణా కార్య క్రమాలని అమలుపరచడానికి గాను బాలల సంక్షేమం కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లు, ప్రత్యేకంగా బాలనేరస్థులన్యాయానికి స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్లు,ఇంకా జువైనల్ జస్టిస్ బోర్డులని రూపొందించడము అవసరంకనుక తగినసహాయంఅందిం చుతుంది. సమగ్ర శిశు రక్షణకి అవసరమయిన చట్టాలని రూపొందించడం కోసం కోర్ చైల్డ్ ప్రొటెక్షన్ లెజిస్లేషన్ ని చేస్తూ,పబ్లిక్ ఫైనాన్స్ మెకానిజంలని  బలోపేతంచే య డానికి యునిసెఫ్ (UNICEF )పనిచేస్తుంది.   పిల్లలని బలవంతంగా ఒకచోట ఉంచే ఇన్స్టిట్యూషనలైజేషన్ ని నిరోధించేవి, ఇంకా కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ రెసిడెన్షియల్ కేర్ అవసరాన్ని తగ్గించేలాగ ఒక విధానాన్ని  తేవడంద్వారా లింకేజ్ లపై ఫోకస్ పెట్టే బలవర్ధక చర్యలకి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. బాల లపై అత్యాచారాలు, బాలలను దోపిడీకి గురికాకుండా ఆపడం కోసం,  బాలలరక్షణా కమిటీలు  ఇంకా,గ్రామాలలో పనిచేయడానికి విలేజ్ విజిలెన్స్ గ్రూపులని రూపొం దించడం జరుగుతుంది. దానితో పాటుగా బాలలకి ఒక సురక్షితమయిన వాతావర ణం అందించడం జరుగుతుంది.  

బాల్యవివాహాలను నిరోధించడానికి ఇంకా బాల్యవివాహాల వ్యతిరేకంగా, బాలలపై హింసాత్మక చర్యలకి  చట్టాలని చేయడం, సమర్థవంతంగా అమలుపరచడంలో భాగంగా ఈ సమస్యలపరిష్కారానికి నడుం బిగించి, దానిని పబ్లిక్ అజెండాగా, ఒక చర్చనీయాంశంగా మార్చి దానిని మరింత దృష్టి సారించవలసిన విషయంగా, రాజకీయ ప్రాముఖ్యతను సంతరింపచేయడంగురించి కృషిచేయడానికై, యునిసెఫ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసిపనిచేస్తుంది.                                                               

యునిసెఫ్ (UNICEF )వివిధ అంశాలని జతచేస్తూ పోయే పని, వ్యక్తిజీవితంలో ముఖ్యమయిన రెండు దశలని అంటే శిశువు అభివృద్ధి(3 నుండి 6 సంవత్సరాల వయసు) ఇంకా యుక్తవయసులో సమగ్ర వికాసం(10 నుండి19 సంవత్సరాల వయసు) చుట్టూరా తిరుగుతుంది. ఇది బాలల మరియు మహిళల హక్కులని సంరక్షించడానికి గల అన్ని కార్యక్రమాలని ఇది అనుసంధానపరుస్తుంది.       

యునిసెఫ్ (UNICEF )ప్రధాన మదుపు వ్యక్తిజీవితంలోని రెండవదశాబ్దం అభివృద్ధి పై ఉంటుంది. ఏమంటే,  దోపిడీకి గురయే క్రమంలోగల తరతరాల అంతరాలని, తెగ్గొ ట్టడం కష్టమయిన పని, మరిముఖ్యంగా యుక్తవయసువారైతే అత్యంత ప్రభావవం తమయిన మార్పుకి నిర్మాతలు కాగలరు, వారేమీ పరోక్ష లబ్దిదారులు కాదుగా! యునిసెఫ్, సమాజంలో చర్చకు వీలుకలిగిస్తుంది, యుక్తవయసువారు వారికి అవసరమయిన విషయాలలో ప్రవర్తనాపరమయిన మార్పు తెచ్చుకోవడానికిగాను చర్చలలో పాల్గొనడానికి మార్పు తెచ్చుకోవడానికి సాధ్యపడేలా చూడడం దీని ఉద్దేశ్యం. యునిసెఫ్ సామాజిక భద్రత రక్షణా కార్యక్రమాలను బలోపేతం చేసుకోవడానికి తద్ద్వారా యుక్తవయసు బాలికలకి బడికి వెళ్ళడానికి, వారి సెకండరీ స్థాయి విద్యని అందుకోవడానికి వీలు కలుగుతుంది.                                                                         

ఈ రాష్ట్రం ప్రకృతి భీభత్సాలకి గురయే ప్రమాదం ఉన్నది. అందులోనూ ఏడు జిల్లాలు తరచుగా సైక్లోన్ అంటే తుఫాన్లకు గురయే అవకాశం, ఉన్నది ఇంకా రాష్ట్రం లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రజలు ఆదుష్పరిణామాలకి బలవడం జరుగుతుంది. అలాగే, మరి నాలుగు జిల్లాలు తరచుగా కరువుకాటకాలకి గురవుతాయి. మరి అలాంటప్పుడు పిల్లలకి రక్షణ విధానాలని రూపొందించడం డిజాస్టర్ రిస్క్ తగ్గించే చర్యలతో బడి రక్షణకోసమై సపోర్ట్ అందించడం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతంలో యుక్తవయసు వచ్చిన పిల్లలను మానవతా దృక్పథపు పరిస్థితులలొ బాలల రక్షణ కార్యక్రామాల సమీక్ష లలో పాల్గొనేలాగ చేయడం ద్వారా డిజాస్టర్ హై రిస్క్ రిడక్షన్ ప్లానింగ్ అంటే అత్యంత తీవ్రస్థాయి ప్రమాద ప్రభావాన్ని తగ్గించడానికిగాను ఈ కార్యక్రమం పటిష్టంగా పనిచేస్తున్నది.  

వనరుల

మీరు లేదా మీకు ప్రియమైనవారు పరీక్షలో కోవిడ్-19

భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఇప్పుడిది కష్టకాలం.

కథ చదవండి