తెలంగాణ
ఎదుగుదల లోపం , వ్యర్థమవడం పరిష్కరించడం మరియు తల్లిపాలు ఇచ్చే పద్దతుల్ని మెరుగుపర్చడానికి వివిధ అంశాల ప్రణాళిక పై పని చేస్తున్నాము.

సవాలు
ఆంధ్రప్రదేశ్ లో వాయవ్య ప్రాంతం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రంగా ఒక కొత్త రాష్ట్రంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు పది సంవత్సరాలకు గాను హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో పర్వతాలు, కొండలు శ్రేణులు అధికంగా ఉండి దట్టమైన అడవులతో ఆ ప్రాంతం కప్పబడింది.
ఈ కొత్త రాష్ట్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. పట్టణం మరియు గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణల ఏర్పాటులో అసమానతలు మరియు అత్యధిక సి-సెక్షన్ రేట్స్ తో రాష్ట్రం కేటాయించబడిన సంరక్షణ నాణ్యతను మెరుగుపర్చవల్సి ఉంది.
తల్లిపాలు తక్కువగా ఇచ్చిన పద్ధతులతో పాటు ఎదుగుదల తగ్గిపోవడం, శరీరం బలహీనపడటం; రాష్ట్రం సమస్యలతో పోరాడటానికి వివిధ అంశాలు ప్రణాళిక చేయాలి. తెలంగాణ ' మూడు రకలా పోషకాలు' భారం పరిస్థితితో బాధపడుతోంది: పోషకాహారం లోపం, అధిక పోషకాహారం/ ఊబకాయం మరియు రక్తహీనతకు గురైన మహిళలు.
నాణ్యతతో కూడిన శీఘ్ర బాల్య విద్య తక్కువగా అందుబాటులో ఉండటం, బాలురు మరియు బాలికలకు అధ్వానమైన నేర్చుకునే స్థాయిలుతో రాష్ట్రం పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను పిల్లలకు కేటాయించడంలో పెద్ద సవాలు ఎదుర్కొంది. విద్యా హక్కు చట్టం (ఆర్ టీఈ) అమలు చేయడానికి మద్దతు కూడా అవసరం.
ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) గా ఇంకా ప్రకటించని దక్షిణాది రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కొన్ని జిల్లాల్లో ఓడీఎఫ్ హోదాని సుస్థిరం చేయడం పెద్ద సవాలుగా ఉంది. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య కేంద్రాలలో వాష్ సదుపాయాలు తక్కువ నిర్వహణ మరియు పనితీరుతో పాటు రాష్ట్రం త్రాగు నీరు సమస్యల్ని కూడా ఎదుర్కొంటోంది.
బాల కార్మికులు, పాఠశాల భద్రత మరియు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ జిల్లాల్లో చట్టబద్ధమైన మరియు చట్టబద్ధం కాని వ్యవస్థలు లేకపోవడం పిల్లల్ని కాపాడటంలో తీవ్రమైన ఆటంకంగా ఉన్నాయి.
పిల్లల హక్కులు మరియు సంక్షేమం ప్రగతి
రెండు అత్యంత ప్రాధాన్యత గల జిల్లాలు : ఆదిలాబాద్ మరియు మహబూబ్ నగర్ లలో ఆరోగ్యం, పునరుత్పాదన, తల్లీ, నవజాత శిశువు, పిల్లలు మరియు యుక్తవయస్కుల ఆరోగ్య వ్యూహం పై ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ కార్యక్రమం అమలుచేయడంలో యునిసెఫ్ ప్రముఖ అభివృద్ధి భాగస్వామిగా ఉంది. దీనితో పాటు, శిశువులు మరియు చిన్న పిల్లలకు సక్రమంగా తల్లిపాలు ఇచ్చే పద్ధతులు, చికిత్స మరియు తీవ్రమైన పోషకాహారం లోపం నిర్వహణలు ప్రోత్సహించడం ద్వారా పిల్లల్లో పోషకాహారం లోపం మరియు ఎదుగుదల ( వయస్సుకి తగిన ఎత్తు లేకపోవడం) తక్కువగా ఉండటాన్ని తగ్గించడానికి రాష్ట్రానికి మద్దతు ఇవ్వబడింది.
బాలురు మరియు బాలికలకు నేర్చుకునే వాతావరణం సమానంగా అందుబాటులో ఉండటం మరియు నాణ్యతతో కూడిన విద్యా సేవలు ప్రయోజనం పొందాలని విద్య గురించి యునిసెఫ్ చేస్తున్న కృషి కోరుకుంటోంది. పరిశుభ్రతా చైతన్యం పెంపు పై ఇది దృష్టి కేంద్రీకరిస్తోంది, బహిరంగ మల విసర్జనని నిర్మూలించడంలో చేసే ప్రయత్నాలకు రాష్ట్రానికి మద్దతు ఇస్తోంది మరియు పరిశుభ్రమైన మరియు సురక్షితమైన త్రాగు నీటికి హామీ ఇస్తోంది. ఇంకా, పిల్లలు ప్రమాదకరమైన శ్రమ, బాల్య వివాహాలు, అక్రమ రవాణా మరియు ఇతర దోపిడీ రకాలు నుండి వారిని కాపాడటానికి కఠినమైన చట్టాలు అమలయ్యేలా నిర్థారించడానికి కూడా కృషి చేస్తోంది.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసూతి గదులు ప్రామాణీకరించడం మరియు ఆధునిక స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్స్ (ఎస్ఎన్ సీయూలు) ఏర్పాటు చేయడం ద్వారా తల్లీ, బిడ్డలక సంరక్షణ నాణ్యతను మెరుగుపర్చడంలో యూనిసెఫ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. కంగారూ మదర్ కేర్ (కేఎంసీలు) కూడా రాష్ట్రంలో పెరిగాయి.
ఇమ్యునైజేషన్ అందరికీ అందచేసేలా మెరుగుపర్చడం మరియు శీతల గిడ్డంగుల నిర్వహణ వ్యవస్థని బలోపేత్తం చేయడంలో యునిసెఫ్ రాష్ట్రానికి మద్దతు ఇస్తోంది. మీజిల్స్ నిర్మూలించి, రుబెల్లాని నియంత్రించడంలో, యునిసెఫ్ మీజిల్స్ -రుబెల్లా (ఎంఆర్) టీకాలు ప్రారంభించడం లో మద్దతు కేటాయించింది. ఇది పెంటావాలెంట్ మరియు ఇన్ యాక్టివేటెడ్ పోలియో (ఐపీవీ) టీకాని ప్రారంభించడంలో కూడా మద్దతు చేసింది.
యాంటీరిట్రోవైరల్ థెరపీ (ఏఆర్ టీ)కి అనుసంధానమైన హెచ్ఐవీకి గురైన గర్భిణీలు కోసం ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టు ఛైల్డ్ ట్రాన్స్ మిషన్ (పీపీటీసీటీ) కోసం మరింత సమర్థవంతమైన బహుళ-ఔషధ నియమావళి ప్రారంభించడంలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీతో పాటు పని చేస్తూ, యూనిసెఫ్ విజయవంతమైంది. విశ్వజననీయమైన పరీక్షా సేవలు మరియు నవజాత శిశువులు అక్రమ రవాణా మరియ పరీక్షలతో పాటు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న గర్భిణీ మహిళలకు చికిత్సలు కూడా చేసింది.
రాష్ట్రంలో పోషకాహారం లోపం గల పిల్లల జీవితాల్ని మెరుగుపర్చడానికి యునిసెఫ్ కట్టుబడింది. సామర్థ్యం నిర్మాణం మరియు ఎస్ఏఎం కేస్ షీట్స్ ప్రామాణీకరణ పై సహకార చర్య ద్వారా పిల్లల్లో సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ (ఎస్ఏఎం) తగ్గించడానికి ప్రాధాన్యత ఇవ్వబడింది.

ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డవలప్ మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) క్రింద అన్నప్రాశన్ మరియు ఇతర కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థలు ద్వారా ఎర్లీ ఛైల్డ్ హుడ్ డవలప్ మెంట్ తో పూరక ఆహారాలు అందచేయడాన్ని బలోపేత్తం చేయడంలో యునిసెఫ్ రాష్ట్రానికి మద్దతు ఇస్తోంది. యుక్త వయసు బాలికలు మరియు మహిళలు కోసం సూక్ష్మ పోషకాలు అందచేసే కార్యక్రమాలు అందుబాటులో ఉండటం మరియు నాణ్యతల్ని బలోపేత్తం చేయడంలో కూడా దృష్టి కేంద్రీకరించబడింది.
అంగన్ వాడి కేంద్రాలలో యాంటీ నాటల్ కేర్ (ఏఎన్ సీ) తో తల్లుల పోషకాహారం మెరుగుపర్చడంలో ' ఆరోగ్య లక్ష్మి' కార్యక్రమాన్ని అమలుచేయడంలో యునిసెఫ్ రాష్ట్రానికి కూడా మద్దతు ఇచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 2.5 లక్షల గర్భిణీలు మరియు తల్లిపాలు తాగే మహిళలు ప్రయోజనం పొందారు.
ఎదుగుదల పర్యవేక్షణ యంత్రాంగాలలో ప్రభుత్వానికి సహాయం చేయడంలో, రాష్ట్రంలో పోషకాహారం పరిస్థితిని నిత్యం పర్యవేక్షించడానికి స్మార్ట్ డ్యాష్ బోర్డ్ అభివృద్ధి చేయబడింది.
పిల్లలు హితమైన బోధనా పద్ధతుల్ని అమలుచేయడంలో వ్యవస్థాపరమైన సామర్థ్యాన్ని రూపొందించడంలో యునిసెఫ్ రాష్ట్రానికి మద్దతు ఇస్తుంది. ఇది స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కి మద్దతు ఇస్తుంది. తరగతి గది అనుభవాన్ని పెంచడానికి పరస్పర ముఖాముఖీ డిజిటల్ కంటెంట్ అభివృద్ధి చేయబడింది మరియు యునిసెఫ్ సరళమైన ప్రత్యామ్నాయ ప్రాథమిక విద్యని ప్రోత్సహిస్తుంది.
2.5-6 సంవత్సరాల వయస్సున్న పిల్లల సమూహం కోసం అమలయ్యే ప్రతిపాదిత నమూనా అంశాలతో ఎర్లీ ఛైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (ఈసీటీ) విధానాలు మరియు పాఠ్యాంశం మరియు సమీకృత విద్యను ఆరంభించడానికి మద్దతు జరిగింది. ఆరంభ్ సమీకృత ప్యాకేజ్ - ఈ విలక్షణమైన ప్యాకేజ్ పిల్లల్ని నియంత్రించడం పై బోధిస్తుంది.
తల్లితండ్రులు తమ పిల్లల్ని పాఠశాలకు పంపించేలా చేసే సామాజిక రక్షణ పథకాలను బలోపేత్తం చేయడం పై కూడా యునిసెఫ్ ప్రాధాన్యతనిచ్చింది.
రాష్ట్రంలో వాష్ సదుపాయాలు మరియు సేవల్ని మెరుగుపర్చడంలో యునిసెఫ్ ప్రభుత్వానికి సాంకేతిక సహాయం అందించింది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ (గ్రామీణ్) ను ప్రభావవంతంగా అమలుచేయడంలో రాష్ట్రం మరియు జిల్లా అధికారుల సామర్థ్యాలను ఇది రూపొందిస్తుంది. ఓపెన్ డిఫకేషన్-ఫ్రీ పరిస్థితిని సాధించడంలో ఇది కరీంనగర్ జిల్లాకు మద్దతు ఇచ్చింది.
పారిశుద్ధ్య లక్ష్యాలు సాధించడానికి సామాజిక ప్రవర్తన మార్పు మరియు కమ్యూనికేషన్ పద్ధతులు ఏర్పర్చడం పై ప్రాధాన్యత ఇవ్వబడింది. కమ్యూనిటీలలో ప్రవర్తనాపరమైన మార్పు తీసుకురావడానికి స్వచ్ఛత వలంటీర్లు గుర్తించబడ్డారు.
ప్రభుత్వపు ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ ప్రొటక్షన్ సర్వీసెస్ (ఐసీపీఎస్) ద్వారా పిల్లల్ని రక్షించే యూనిట్లను బలోపేత్తం చేయడం ద్వారా యునిసెఫ్ రాష్ట్రానికి మద్దతు ఇచ్చింది. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, స్పెషల్ జువైనల్ పోలీసు, జువైనల్ జస్టిస్ బోర్డ్స్ మరియు డిస్ట్రిక్ట్ ఛైల్డ్ ప్రొటక్షన్ యూనిట్స్ ద్వారా ప్రభావవంతంగా పిల్లల రక్షణ కార్యక్రమాన్ని అమలుచేయడానికి కూడా ఇది సామర్థ్యాలను రూపొందిస్తుంది.
ప్రధానమైన పిల్లల రక్షణ చట్టాన్ని అమలుచేయడానికి సామాజిక రక్షణ స్కీంలు, ప్రజా ఆర్థిక వ్యవస్థలు బలోపేత్తం చేయడానికి విద్యా సంస్థలు మరియు లా యూనివర్శిటీలతో కూడా యునిసెఫ్ భాగస్వామాల్ని విస్తరించింది. పిల్లల దోపిడీ మరియు దూషణల్ని నివారించడానికి, యునిసెఫ్ ఛైల్డ్ ప్రొటక్షన్ కమిటీల్ని రూపొందించడానికి మరియు బలోపేత్తం చేయడానికి యునిసెఫ్ పని చేస్తోంది.